'సర్కార్' కు తొలి సమస్య..

     Written by : smtv Desk | Fri, Jun 22, 2018, 03:24 PM

'సర్కార్' కు తొలి సమస్య..

చెన్నై, జూన్ 22 : తమిళ స్టార్ హీరో విజయ్.. ప్రస్తుతం నటిస్తున్న చిత్రానికి 'సర్కార్ ' అనే టైటిల్ ను ఖరారు చేసి.. కొంతసేపటి క్రితమే ఫస్టులుక్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నేడు విజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ ను రిలీజ్ చేసింది. సన్‌పిక్చర్స్‌ బ్యానరుపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మురగుదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ లో విజయ్‌ సిగరెట్‌ తాగుతూ, ఎంతో స్టైలిష్ లుక్‌లో కనిపించారు.

అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ పోస్టర్‌ పలు విమర్శలను ఎదుర్కొంటుంది. తమిళనాడు ఎంపీ అంబుమణి రామదాస్‌ ట్విటర్‌ వేదికగా విజయ్‌ను విమర్శిస్తూ.. పలు ట్వీట్స్ చేశారు. "ఈ పోస్టర్ ద్వారా సిగరెట్ ను ప్రమోట్ చేస్తున్నావా? ఇలా చేయడం నిజంగా సిగ్గుచేటు. ఒక నటుడిగా స్మోకింగ్ ను ప్రమోట్ చేయకపోవడం నీ బాధ్యత" అంటూ విమర్శించారు. అంతేకాదు గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయ్‌ తన సినిమాల్లో పొగతాగనని చెప్పారు. ఇప్పుడు ఇదేంటి..? అంటూ ఆనాటి పేపర్ కట్టింగ్ ను షేర్ చేశారు. దీంతో విజయ్ అభిమానులు ఎంపీని తప్పుపట్టారు. 'మెర్సల్‌' సినిమాలోనూ విజయ్‌ సిగరెట్‌ తాగారని, అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని ప్రశ్నిస్తూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు.





Untitled Document
Advertisements