'ప్రాణ'౦ పెడుతుందిగా..

     Written by : smtv Desk | Sat, Jun 23, 2018, 11:09 AM

'ప్రాణ'౦ పెడుతుందిగా..

హైదరాబాద్, జూన్ 23 : పాత్రనిడివి తక్కువైనా తన పాత్రకు ప్రాధాన్యతకు ఉంటే తప్పకుండా ఆ చిత్రానికి ఓకే చెప్పేస్తుంది నిత్య మీనన్. గ్లామర్ కన్నా నటనకు ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. దీనికి ఇటీవల నిత్యమీనన్ నటించిన 'అ' చిత్రం నిదర్శనం. సినిమాలో వైవిధ్యమైన పాత్రలో కనిపించి ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేసింది. పాత్ర నచ్చాలే కాని అది చిన్నదా.? పెద్దదా.? అనే విషయాన్ని పట్టించుకోదు. తాజాగా మరో సరికొత్త కథతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతోంది. సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న 'ప్రాణ' అనే సినిమాలో చేస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. విశేషమేమిటంటే.. ఈ చిత్రంలో నిత్య మాత్రమే కనిపిస్తుందట. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ఆమె ఒకతే ఈ సినిమాలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి తీస్తున్నారు. మళయాళ మూవీ దర్శకుడు వి.కె.ప్రకాష్ 'ప్రాణ' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా పి.సి. శ్రీరామ్ పనిశారు. అలాగే సౌండ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ విన్నర్ రకుల్ పూకుట్టి 'సరౌండ్ సింక్ సౌండ్' అనే కొత్త టెక్నాజీని వాడుతున్నాడు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.





Untitled Document
Advertisements