స్పీడ్ పెంచిన మెగా హీరోయిన్..

     Written by : smtv Desk | Sat, Jun 23, 2018, 11:52 AM

స్పీడ్ పెంచిన మెగా హీరోయిన్..

హైదరాబాద్, జూన్ 23 : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నీహారిక.. 'ఒక మనసు' సినిమాతో వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత కాస్తంత గ్యాప్ తీసుకున్న ఈ భామ త్వరలో 'హ్యాపీ వెడ్డింగ్' తో ప్రేక్షకుల ముందుకు రానుంది. యూవీ క్రియేష‌న్స్ బ్యానర్ పై ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇదిలా ఉండగా.. నిహారిక మరో క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకుడిగా పరిచయమవుతోన్న సినిమాలో నీహారిక హీరోయిన్ గా నటించనుంది. అమెరికాలోని డిస్ట్రిబ్యూషన్ సంస్థ నిర్వాణ సినిమా ఈ మూవీని నిర్మించనుంది. ఈ సినిమాలో కథానాయకుడిగా రాహుల్ విజయ్ కనిపించనున్నాడు. ఇదీ కాక సుజన దర్శకత్వంలో నిహా.. మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లనున్నాయి.





Untitled Document
Advertisements