'సర్కార్' ఇంట్రో కు స్పెషల్ సాంగ్

     Written by : smtv Desk | Sat, Jun 23, 2018, 12:18 PM

'సర్కార్' ఇంట్రో కు స్పెషల్ సాంగ్

చెన్నై, జూన్ 23 : కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్‌, మురగుదాస్ కాంబోలో 'సర్కార్' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సన్‌పిక్చర్స్‌ బ్యానరుపై రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సంబంధించి నిన్న ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో విజయ్‌ సిగరెట్‌ తాగుతూ, ఎంతో స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మిగతా 20 శాతం చిత్రీకరణను అమెరికాలో జరుపుకోనుందట.

ముందుగా లాస్ వేగాస్ లో విజయ్ ఇంట్రో సాంగ్ ను ప్లాన్ చేశారట. విజయ్ క్రేజ్ కి.. పాత్ర రేంజ్ కి తగినట్టుగా ఈ ఇంట్రో సాంగ్ ను చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. కాగా విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ లుక్ కు సంబంధించి పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.





Untitled Document
Advertisements