అమలాపాల్ ఫస్ట్ లవ్..!!

     Written by : smtv Desk | Sat, Jun 23, 2018, 01:44 PM

అమలాపాల్ ఫస్ట్ లవ్..!!

హైదరాబాద్, జూన్ 23 : ప్రముఖ నటి అమలాపాల్.. తమిళ దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వారిదారికి ఏమో మనస్పర్థలు వచ్చి విడిపోయారు. ప్రస్తుతం ఈ అమ్మడు పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టింది. తాజాగా ఓ సినిమా ప్రొమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఈ భామ.. తన మొదటి ప్రేమకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు.

తనకు మొదటి ప్రేమ ఉందని.. ఆ ప్రేమికుడు మరెవరో కాదు.. ప్రముఖ హీరో మాధవన్ అంటూ పేర్కొంది. చిన్నప్పటి నుంచి మాధవన్ అంటే ఎంతో ఇష్టమని తెలిపింది. అమలాపాల్ ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఆమె పక్కన మాధవన్ కూడా ఉన్నాడు. అమలా మాటలు విన్న మాధవన్.. చిరునవ్వులు నవ్వుతూ చూస్తూ ఉండిపోయాడు. అనంతరం అమలాపాల్ మాధవన్ ను ఆప్యాయంగా హత్తుకుంది.





Untitled Document
Advertisements