మరోసారి హారర్ తో రానున్న నందిత శ్వేత..!!

     Written by : smtv Desk | Sat, Jun 23, 2018, 05:10 PM

మరోసారి హారర్ తో రానున్న నందిత శ్వేత..!!

హైదరాబాద్, జూన్ 23 : 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాతో గుర్తింపు పొందిన తార నందిత శ్వేత. ఆ సినిమా చూసిన వారెవరు ఆమెను అంత త్వరగా మర్చిపోలేరు. నిఖిల్ తో చేసిన ఈ సినిమాలో కీలకమైన పాత్రలో మెప్పించిన నందిత ఆ తర్వాత మాత్రం తెలుగులో ఆఫర్స్ లేక తమిళ్ కే పరిమితమయ్యింది. ఎందుకంటే.. అది గ్లామర్ పాత్ర కాకపోవడంతో పాటు హారర్ ఛాయలు ఉండటం తనకు మైనస్ గా నిలిచింది. తాజాగా నందిని శ్వేత.. మళ్ళీ హారర్ తరహా సినిమాలో చేయడానికి రెడీ అవుతోంది.

2013లో సుధీర్ బాబు.. నందిత కాంబినేషన్ లో విడుదలైన 'ప్రేమకథా చిత్రమ్' భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. జె. ప్రభాకర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సీక్వెల్ కి హరికిషన్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. నందిత శ్వేత ఈ చిత్రంలో నటించనుంది. అయితే ఈ అమ్మడు 'ప్రేమ కథా చిత్రమ్ 2' పై ఆశలు పెట్టేసుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది కూడా హారర్ మూవీనే కాబట్టి. ఈ సినిమాలో మరో కథానాయికగా ఆయన సిద్ధి ఇద్నానిని తీసుకున్నట్టు సమాచారం. త్వరలోనే మిగతా నటీనటుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి, సెట్స్ పైకి వెళ్లడానికి దర్శక నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు.





Untitled Document
Advertisements