అతి తక్కువ బడ్జెట్ లో 'నయనతార 63'..!!

     Written by : smtv Desk | Sat, Jun 23, 2018, 05:54 PM

అతి తక్కువ బడ్జెట్ లో 'నయనతార 63'..!!

హైదరాబాద్, జూన్ 23 : క‌థానాయిక ప్రాధాన్య‌మున్న సినిమాల్లోనూ న‌టిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ను సృష్టించుకున్న కథానాయిక నయనతార. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లలో హవా చాటుకుంటున్నారు. ప్రస్తుతం నయన్.. అజిత్‌తో 'విశ్వాసం', 'కోలమావు కోకిల', 'ఇమైకా నొడిగల్‌'.. వంటి పలు చిత్రాల్లో నటిస్తున్నారు. స్టార్‌ హీరోలకు సమానంగా ఈ అమ్మడు చిత్రాలకు మార్కెట్‌ ఉంటోంది.

ఇదిలా ఉండగా కేజేఆర్‌ స్టూడియోస్‌ బ్యానరులో నయనతార మళ్లీ నటించడానికి సిద్దపడినట్లు తెలుస్తోంది. నయన్ 63వ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. ప్రస్తుతానికి 'నయనతార 63' అని వర్కింగ్‌ టైటిల్‌ పెట్టారు. అయితే విషయం ఏంటంటే.. చాలా తక్కువ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ పూర్తి వివరాలను తెలియజేయనున్నారు.





Untitled Document
Advertisements