టైటిల్ కు పోస్టర్ కు సంబంధం ఉందా..!!

     Written by : smtv Desk | Sat, Jun 23, 2018, 06:31 PM

టైటిల్ కు పోస్టర్ కు సంబంధం ఉందా..!!

ముంబై, జూన్ 23 : బాలీవుడ్ లో 'సత్యమేవ జయతే' అనే టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో ఐషా శర్మ వెండితెరకు పరిచయం కానుంది. ఈ అమ్మడు 'చిరుత' సినిమాలో కథానాయికగా నటించిన నేహాశర్మ చెల్లెలు కావడం విశేషం. బాలీవుడ్ కండల వీరుడు జాన్ అబ్రహాం ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ను చూస్తే.. ఇది దేశభక్తి కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా అన్న విషయం అర్ధమైంది. టైటిల్ లోగో కూడా ఆర్మీ మెడల్ ను ప్రతిబింబించేలా డిజైన్ చేశారు. భారతీయులందరిలోనూ దేశభక్తి పొంగి పొరలే రోజునే ఆగస్టు 15న ఈ మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పై పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా ఫస్ట్ లుక్ లోనే ప్రేక్షకులను అట్రాక్ట్ చేసేలా పోస్టర్ ఉండాలని అనుకోవడం తప్పులేదు. కాని ఈ 'సత్యమేవ జయతే' ఫస్ట్ లుక్ లో మాత్రం హీరోయిన్ గా నటిస్తున్న ఐషా శర్మ ను సెక్సీగా చూపించారు. అసలు ఈ సినిమా టైటిల్ కు.. హీరోయిన్ ఫిగర్ కు సంబంధం ఏంటి అని ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతైంది.

Untitled Document
Advertisements