అమెరికా సెక్స్ రాకెట్ : శ్రీ రెడ్డి లీక్స్..

     Written by : smtv Desk | Sat, Jun 23, 2018, 08:08 PM

అమెరికా సెక్స్ రాకెట్ : శ్రీ రెడ్డి లీక్స్..

హైదరాబాద్, జూన్ 23 : టాలీవుడ్ లో 'కాస్టింగ్ కౌచ్' ఉందంటూ దానికి వ్యతిరేకంగా ఓ ఉద్యమమే చేసింది శ్రీరెడ్డి. ఆ మధ్య ఆమె ఏమి చేసిన మీడియా మిత్రులు తెగ హడావిడి చేసేశారు. అక్కడి వరకు బాగానే ఉన్న ఒక స్టార్ పవర్ దెబ్బకు శ్రీరెడ్డి పోరాటం ఏటో వెళ్లిపోయింది. ఇక అక్కడి నుండి ఈ అమ్మడు వార్తల్లో వెతికిన దొరకలేదు. కాగా అప్పుడప్పుడు అంతర్జాలంలో హల్ చల్ చేస్తుంది. ఇప్పుడు అమెరికా సెక్స్ రాకెట్ అంశం దొరికిందిగా.

ఇక చూస్కోండి నటి శ్రీ రెడ్డి ఒక బాంబ్ పేల్చింది. అదేంటంటే.. గత వారం రోజులుగా టాలీవుడ్‌ను కుదిపేస్తున్న టాలీవుడ్ సెక్స్ రాకెట్ వివాదంలో భాగంగా.. 36 మందితో కూడిన లిస్ట్‌ను సోషల్ మీడియాలో లీక్ చేసింది. ఈ లిస్ట్‌లో ఉన్నవాళ్లే కాకుండా ఇంకా చాలా మంది సింగర్స్, టీవీ యాక్టర్స్, షార్ట్ ఫిల్మ్ యాక్టర్స్, మలయాళ, తమిళ చిత్రాలకు చెందిన అనేక మంది ఉన్నారంటూ పెద్ద లిస్ట్ చెప్పుకొచ్చింది.

ఈ లిస్ట్‌ను లీక్ చేసిన అనంతరం ఫేస్ బుక్‌ లైవ్ లోకి వచ్చిన శ్రీరెడ్డి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. "అమెరికా సెక్స్ రాకెట్‌ విషయంలో అక్కడ పోలీసులకు నా సహకారం అందించాను. ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. నేను ఈ పేర్లు బయట పెట్టడం వల్ల నన్ను ఎవరైనా ఏదైనా చేయొచ్చు అయినా నాకు భయంలేదు. ఈ లిస్ట్‌లో ఉన్నవాళ్లు.. వాళ్లను ఉంచుకున్న పొలిటికల్ లీడర్స్ నన్ను చేయొచ్చని వెనకడుగు వేసేదాన్నైతే ఇలా మీ ముందుకు వచ్చే దాన్ని కాదు. అమెరికా సెక్స్ రాకెట్‌లో ప్రాస్టిట్యూట్ చేసే వాళ్లు రెండు రకాలుగా ఉన్నారు. అప్పటికే టాప్ హీరోయిన్ రేంజ్‌లో ఉండి సంపాదించినది చాలక ఇలాంటి పనులు చేసేవారు. చేతిలో అవకాశాలు లేక గ్లామర్ ఫీల్డ్ పట్ల ఆసక్తి ఉండే వాళ్లు చేతిలో ఆఫర్స్ లేకపోవడంతో మేనేజర్స్ ఉచ్చులో పడుతున్నారు" అని శ్రీ రెడ్డి వ్యాఖ్యానించింది.

"ఇలాంటి సమస్య ఉన్నప్పుడు టాలీవుడ్ బడాబాబులు బయటకు రారు. సమస్యను పరిష్కరించరు. దగ్గుబాటి సురేష్ బాబు లాంటి నిర్మాతలు వాళ్ల సినిమాల ప్రమోషన్ టైంలో బయటకు వస్తారు తప్ప ఇలాంటి ఇష్యూలపై స్పందించరు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవాళ్లను , చిన్న చిత్రాలు ఎదుర్కొంటున్న సమస్యలన్ని ఎందుకు పరిష్కరించరు" శ్రీరెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. శ్రీ రెడ్డి అలవాటైన పద్దతిలో ఎటువంటి ఆధారాలను మాత్రం బయటపెట్టలేకపోయింది.

Untitled Document
Advertisements