నాగచైతన్య న్యూ మూవీ షురూ..

     Written by : smtv Desk | Sun, Jun 24, 2018, 12:24 PM

నాగచైతన్య న్యూ మూవీ షురూ..

హైదరాబాద్, జూన్ 23 : యువ కథానాయకుడు నాగశౌర్య మరో చిత్ర౦ పూజా కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ సినిమాతో రాజా కోలుసు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనంద ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమా కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తు౦డగా.. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ బాణీలు అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా పూజా కార్యక్రమాలు కూక‌ట్‌ప‌ల్లిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో లాంఛ‌నంగా జరిగాయి. ఆగ‌స్టు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. త్వరలోనే మిగిలిన న‌టీన‌టుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని నిర్మాత చెప్పారు. నాగశౌర్య ఇటీవల నటించిన 'కణం', 'అమ్మమ్మగారిల్లు' మంచి విజయ సాధించిన విషయం తెలిసిందే.

Untitled Document
Advertisements