ట్విట్టర్ లో మళ్ళీ రేణూ..!!

     Written by : smtv Desk | Sun, Jun 24, 2018, 12:41 PM

ట్విట్టర్ లో మళ్ళీ రేణూ..!!

హైదరాబాద్, జూన్ 23 : ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ త్వ‌ర‌లో మ‌రో వ్య‌క్తితో పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నట్లు చెప్పకనే చెప్పింది. ఇటీవల తనకు జీవిత భాగస్వామి దొరికినట్లు ఓ వ్యక్తి చేయిపట్టుకుని దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తను రెండో పెళ్లి చేసుకోవద్దని సలహా ఇచ్చిన ఓ అభిమానికి రేణూ ఘాటైన సమాధానం ఇచ్చింది. ఓ అభిమాని రేణూ వివాహం గురించి స్పందిస్తూ..'మీరు రెండో పెళ్లి చేసుకుంటే గొడవలు అవుతాయ్‌. నా దేవుడికి(పవన్‌ కల్యాణ్‌) ఎలాంటి సమస్యలు రాకూడదు. కాబట్టి ఏం చేసినా ఆలోచించి చేయండి.' అని మెసేజ్‌ చేశాడు. ఇందుకు రేణూ స్పందిస్తూ.. 'క్రేజీ' అని స్పందించారు.

అలాగే "మీరు మరో వివాహం చేసుకోవద్దు. అలా చేస్తే, మీకు, బయటివారికి తేడా ఏముంటుంది? అసలు పవన్ కల్యాణ్, మీలాంటి అందమైన భార్యను ఎందుకు వదులుకున్నారో అర్థం కావడం లేదు" అని కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన రేణు, "ఇలాంటి క్రేజీ అబ్బాయిలు వారి తల్లులు, అక్క చెల్లెళ్లతో ఎలా ప్రవర్తిస్తుంటారో? వారి మానసిక ఆరోగ్యం గురించి చింతిస్తున్నాను" అని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా.. పలువురు ఆమె వివాహానికి మద్దతిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు మద్దతిస్తున్న అబ్బాయిలకు పేరుపేరునా ధన్యవాదాలు అని.. వారి తల్లిదండ్రులు వారిని ఎంతో చక్కగా పెంచారని కితాబిచ్చింది.





Untitled Document
Advertisements