వైరల్ : రేణూ దేశాయ్ నిశ్చితార్థం..

     Written by : smtv Desk | Sun, Jun 24, 2018, 01:52 PM

వైరల్ : రేణూ దేశాయ్ నిశ్చితార్థం..

హైదరాబాద్, జూన్ 23 : ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఉంగరాలు మార్చుకున్న ఫొటోను పంచుకున్నారు. ఈ ఫోటోలో తన జీవిత భాగస్వామి చేతిపై చెయ్యేసి ఉండగా నిశ్చితార్థపు ఉంగరాలు కనిపిస్తున్నాయి.

ఈ మేరకు రేణూ.. తనకు కాబోయే భర్తకు ధన్యవాదాలు చెబుతూ.. 'బాధ నుంచి కోలుకునేందుకు నాకు సహాయంగా నిలిచినందుకు నీ నిజాయితీ మనసుకు ధన్యవాదాలు' అని రాశారు. అయితే ఆ వ్యక్తి ఎవరో మాత్రం రేణు చెప్పలేదు. కనీసం అతడి పేరు కూడా వెల్లడించలేదు. అయితే రేణూ తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది పవన్‌కల్యాణ్‌ అభిమానులు తప్పుపట్టగా, మరికొందరు ప్రోత్సహించారు. తనకు మద్దతు తెలిపిన అందరికీ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు.





Untitled Document
Advertisements