వామ్మో..! 100 పైగా సర్పాలు..

     Written by : smtv Desk | Sun, Jun 24, 2018, 02:13 PM

వామ్మో..! 100 పైగా సర్పాలు..

భువనేశ్వర్‌, జూన్ 24 : పాము అంటే అందరికి భయమే.. ఒక్క పామును చూస్తూనే భయంతో వణికిపోతాం. అలాంటింది 100కు పైగా సర్పాలు ఒక్క దగ్గర చూస్తే ఇంకామైన ఉందా..! తాజాగా ఒరిస్సాలోని శ్యాంపూర్‌ గ్రామంలో జరిగిన సంఘటన ఇలాంటిదే. భుయాన్‌ అనే వ్యవసాయ కూలీ ఇంట్లో 111 పాము పిల్లలు శనివారం వెలుగుచూశాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రెండు మూడు రోజుల వయస్సు గల పాము పిల్లలు భారీ మొత్తంలో ఒకే ఇంట్లో కనబడటంతో గ్రామస్థులు ఆందోళన చెందారు. అయినప్పటికి వేలాది మంది ప్రజలు అక్కడికి చేరుకుని ఆ వింతను చూడసాగారు.

భుయాన్‌ తన భార్య, ఇద్దరు పిల్లలతో అదే ఇంట్లో నివాసం ఉంటున్నాడు. భుయాన్‌ ఇంట్లో నాలుగు అడుగుల ఎత్తు, రెండగుల వెడల్పుతో ఒక పాము పుట్ట ఉన్నప్పటికీ వారు దానికి పూజలు చేస్తుండేవారని తెలిసింది. అప్పుడప్పుడు పాములు కన్పించినప్పటికీ అవి తమకు హాని చేయలేదని భుయాన్‌ చెప్పాడు. అందులో ఎన్ని పాములున్నాయో తమకు తెలియదని ఆయన తెలిపాడు. అటవీ అధికారులు, ఎన్‌జీవో ప్రతినిధులు అక్కడికి చేరుకుని 111 పాము పిల్లలు అక్కడికి ఎలా వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారికి అక్కడ 26 పగిలిన పాము గుడ్లు మాత్రమే కన్పించడంతో వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తల్లి పాముల గురించి వెతకడం ప్రారంభించారు. అధికారులు మాత్రం అక్కడ దొరికిన పాము పిల్లల్ని జనవాసాలకు దూరంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించనున్నట్టు వెల్లడించారు.


Untitled Document
Advertisements