ట్రంప్ పై పెరిగిపోతున్న వ్యతిరేకత..

     Written by : smtv Desk | Tue, Jun 26, 2018, 01:25 PM

ట్రంప్ పై పెరిగిపోతున్న వ్యతిరేకత..

అమెరికా, జూన్ 26 : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సీఎన్‌ఎన్, ఎస్‌ఎస్‌ఆర్‌ఎస్‌ తాజా పరిశోధన తేల్చి చెప్పింది. 42 శాతం మంది అమెరికన్లు ట్రంప్‌ అభిశంసనని కోరుకుంటున్నట్టు ఈ పరిశోధనలో వెల్లడయ్యింది.1974 మార్చిలో వాటర్‌ గేట్‌ కుంభకోణం సందర్భంగా నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ పదవి నుంచి దిగిపోవాలని 43 శాతం మంది భావిస్తే, ఈ రోజు 42 శాతం మంది భావిస్తున్నారని సర్వే తెలిపింది. అదేవిధంగా బరాక్‌ ఒబామా, జార్జ్‌ బుష్‌లు అధ్యక్షస్థానంలో ఉన్నప్పుడు వారిని పదవినుంచి దిగిపోవాలని దాదాపు 29 నుంచి 30 శాతం మంది కోరుకున్నారు. దానికంటే కూడా ఎక్కువమంది అమెరికన్లు ట్రంప్‌ అధ్యక్షపదవి నుంచి తొలగిపోవాలంటున్నారని తాజా నివేదిక వెల్లడించింది.

1974 మార్చిలో వాటర్‌ గేట్‌ కుంభకోణం సందర్భంగా నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ పదవి నుంచి దిగిపోవాలని 43 శాతం మంది భావించారు. అంతిమంగా అభిశంసనపై ఓటింగ్‌కి ముందే అధ్యక్ష పదవికి నిక్సన్‌ రాజీనామా చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యాప్రమేయంపై రాబర్ట్‌ ముల్లర్‌ దర్యాప్తు చేస్తుండడం వల్ల ట్రంప్‌ అభిశంసన విషయాన్ని డెమొక్రాట్లు ప్రస్తుతానికి పక్కనపెట్టారు. అభిశంసన అంశంపై ఒక నిర్ణయానికి వస్తే నవంబర్‌ లో జరగబోయే ఎన్నికల్లో వ్యతిరేక ప్రభావం ఉంటుందన్న భయం కూడా డెమొక్రాట్లను వెంటాడుతోంది.





Untitled Document
Advertisements