'పార్టీ' కోస౦ సూర్య, కార్తి..!

     Written by : smtv Desk | Sun, Jul 01, 2018, 03:48 PM

'పార్టీ' కోస౦ సూర్య, కార్తి..!

చెన్నై, జూలై 1 : తమిళ, తెలుగు పరిశ్రమలలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న అన్నదమ్ములు సూర్య, కార్తి. అన్న సూర్య వారసత్వంతో అరంగేట్రం చేసిన సూర్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. అయితే అభిమానులు వీరిద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూడాలని ఎప్పట్నుంచో కోరుకుంటున్నారు. కాని వీరిద్దరూ కలిసి నటించకపోయినా.. ఒక సినిమా కోసం కలిసి పాట పాడుతుండటం విశేషం. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ మూవీ కోసం ఈ అన్నదమ్ములు గొంతు సవరించుకుంటున్నారు.

అందులో ఒక వెరైటీ పాటను కలిసి ఆలపించబోతున్నట్లు సమాచారం. అయితే వెంకట్ ప్రభు ఇంతకుముందు సూర్యతో 'రాక్షసుడు'.. కార్తితో 'బిరియాని' అనే సినిమాలు తీశాడు. దర్శకుడు వెంకట్ ప్రభుతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా వీళ్లిద్దరూ అతడి సినిమా కోసం పాట పాడేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. తాజాగా దర్శకుడు వెంకట ప్రభు తమిళంలో తెరకెక్కిస్తున్న సినిమా 'పార్టీ'. సత్యరాజ్, జయరాం, జై, నాజర్, రెజీనా, రమ్యకృష్ణ, నివేథా పెతురాజ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు.





Untitled Document
Advertisements