డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపిన పంజాబ్ ప్రభుత్వం..

     Written by : smtv Desk | Mon, Jul 02, 2018, 07:12 PM

 డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపిన పంజాబ్ ప్రభుత్వం..

పంజాబ్, జూలై 2 : పంజాబ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు చర్యలు చేపట్టినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సోమవారం (జులై 2) తెలిపారు. డ్రగ్స్ అమ్మేవారు.. స్మగ్లింగ్ చేసేవారికీ మరణశిక్ష విధించాలని.. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో డ్రగ్స్ రవాణా చేసేవారు యువత జీవితాలను నాశనం చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాకిస్థాన్ నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని.. దీనివల్ల యువత వాటికి బానిసలుగా మారుతున్నారని అన్నారు. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు డ్రగ్స్ నిషేధమే ప్రధాన ఎజెండాగా ప్రచారం చేపట్టాయి. అధికారంలోకి రాగానే డ్రగ్స్‌ను అరికడతామని హామీ కూడా ఇచ్చాయి. హామీ ఇచ్చినట్లుగానే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డ్రగ్స్‌పై కఠిన చర్యలు చేపట్టేందుకు నిర్ణయించింది.





Untitled Document
Advertisements