తితిదేకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు..

     Written by : smtv Desk | Tue, Jul 03, 2018, 03:44 PM

తితిదేకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు..

హైదరాబాద్‌, జూలై 3 : తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) సీఈవోతో పాటు, రాష్ట్ర దేవాదాయ శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. (తితిదే)లో నెలకొన్న వివాదాలపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. నగల మాయం, ఆదాయ వ్యయాలు, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారన్న అభియోగాలపై సీబీఐతో విచారణకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది.

గుజరాత్‌కు చెందిన భూపేందర్‌ గోస్వామి, గుంటూరు జిల్లాకు చెందిన అనిల్‌కుమార్‌ అనే ఇద్దరు భక్తులు గతంలో పిల్‌ దాఖలు చేశారు. వీటిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని వారు పిటిషన్‌లో కోరారు. ఈ పిల్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తితిదేకు ఆదేశాలు జారీచేసింది.





Untitled Document
Advertisements