ఇండియాలో 'చైనా' బ్యాంక్..

     Written by : smtv Desk | Wed, Jul 04, 2018, 01:58 PM

ఇండియాలో 'చైనా' బ్యాంక్..

ఢిల్లీ, జూలై 4 : చైనా ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంక్ ఆఫ్‌ చైనా.. భారత్ లో కార్యకలాపాలు నిర్వహించనుంది. ఇందుకోసం బ్యాంక్‌ ఆఫ్‌ చైనాకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బుధవారం లైసెన్సు జారీ చేసింది. ఇటీవల ఎస్‌సీవో సదస్సు నిమిత్తం భారత ప్రధాని నరేంద్రమోదీ చైనా వెళ్లారు. అక్కడ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జరిగిన భేటీలో బ్యాంక్‌ ఆఫ్‌ చైనా ప్రస్తావన వచ్చింది. ఆ సందర్భంగా భారత్‌లో బ్యాంక్ ఆఫ్‌ చైనా కార్యకలాపాలు జరిపేందుకు అనుమతినిస్తామని ప్రధాని మోదీ.. జిన్‌పింగ్‌కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. భారత్‌లో వస్తున్న రెండో చైనీస్‌ బ్యాంక్ ఇది. ఇప్పటికే చైనాకు చెందిన ఇండస్ట్రీయల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్ ఆఫ్‌ చైనా లిమిటెడ్‌ కార్యకలాపాలు భారత్‌లో అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు మరో 45 విదేశీ బ్యాంకులు కూడా మన దేశంలో ఉన్నాయి.





Untitled Document
Advertisements