ఆ వార్తలను ఖండించిన జకీర్ నాయక్‌..

     Written by : smtv Desk | Wed, Jul 04, 2018, 04:35 PM

ఆ వార్తలను ఖండించిన జకీర్ నాయక్‌..

ఢిల్లీ, జూలై 4 : వివాదాస్పద ఇస్లాం మతప్రబోధకుడు జకీర్ నాయక్‌ను అతన్ని భారత్ కు వస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు వెలువరించాయి. ప్రస్తుతం ఆయన మలేషియాలో ఉంటున్నారు. జకీర్ నాయక్ విద్వేషపూరిత ప్రసంగాలకు ఆకర్షితుడైన ఓ వ్యక్తి ఐసిస్ లో చేరి, 2016లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో దాడులకు తెగబడ్డాడు. తన దాడులకు కారణం జకీర్ ప్రసంగాలేనని ఆ తర్వాత తెలిపారు. దీంతో, ఆయన భారత్ నుంచి పారిపోయి మలేషియాలో తలదాచుకున్నారు. 'ప్రస్తుతం జాకీర్ మా దేశంలో లేడు. కానీ ఈ రోజు ఇండియా కు వెళ్లే సూచనలు కన్పిస్తున్నాయి.' అని మలేషియా అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ఈ వార్తలపై నాయక్ స్పందిస్తూ.."నేను ఇండియాకు రావడం లేదు. ఆ వార్తల్లో నిజం లేదు. అవన్నీ అవాస్తవాలు. నా పట్ల భారత ప్రభుత్వం న్యాయంగా వ్యవహరిస్తుందన్న భరోసా కలిగినప్పుడు.. రక్షణ ఉంటుందన్న భావన కలిగినప్పుడు మాత్రమే... స్వదేశానికి వస్తాను" అని జాకీర్ వ్యాఖ్యానించారు. టెర్రరిస్టులకు అనుకూలంగా ఉన్న జకీర్ నాయక్ ను అప్పగించాలంటూ మలేషియాను భారత్ ప్రభుత్వం కోరుతుంది.





Untitled Document
Advertisements