అల్ బగ్దాది కుమారుడు హతం..!

     Written by : smtv Desk | Wed, Jul 04, 2018, 05:45 PM

అల్ బగ్దాది కుమారుడు హతం..!

ఇడ్లిబ్, జూలై 4 : ఇస్లామిక్ స్టేట్ నేత అబు బకర్ అల్ బగ్దాది కుమారుడు హుతైఫా అల్ బద్రి చనిపోయినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన సోషల్ మీడియా అకౌంట్లలో ఈ వార్త వచ్చింది. ఓ చిన్న పిల్లవాడు గన్ పట్టుకున్ని ఉన్న ఫోటో ఒకటి వైరల్‌గా మారింది. హోమ్స్ ప్రావిన్సులో సిరియా, రష్యా దళాలతో జరిగిన పోరులో హతమైనట్లు ఆ ప్రకటనలో తెలిపారు. బగ్దాది భార్య, కూతురిని 2014లో లెబనాన్‌లో అరెస్టు చేశారు. అయితే ఎప్పుడు అతను హతమయ్యాడో స్పష్టం చేయలేదు. జూన్ మొదటి వారంలో జరిగిన వైమానిక దాడుల్లో ఈ ఘటన జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఐఎస్ చీఫ్ అల్ బగ్దాది హతమైనట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ అతను ఇంకా బ్రతికే ఉన్నాడని కూడా పుకార్లు వస్తున్నాయి.

Untitled Document
Advertisements