కోహ్లి@ 2000 క్లబ్..

     Written by : smtv Desk | Wed, Jul 04, 2018, 07:33 PM

కోహ్లి@ 2000 క్లబ్..

మాంచెస్టర్‌, జూలై 4 : భారత్ క్రికెట్ కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లి టీ20ల్లో మరో రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో వేగవంతంగా రెండు వేల పరుగుల మైలు రాయిని అందుకున్న ఆటగాడిగా విరాట్ నెలకొల్పాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో కోహ్లీ దీన్ని సాధించాడు. ఇప్పటి వరకు 60 మ్యాచ్‌లాడిని కోహ్లీ 56 ఇన్నింగ్స్‌ల ద్వారా 2,012 పరుగులు చేశాడు. ఈ ఫీట్ ను నలుగురు ఆటగాళ్లు మాత్రమే అందుకున్నారు. న్యూజిలాండ్‌ ఆటగాళ్లు మార్టిన్‌ గప్తిల్‌ (2,271), బ్రెండన్‌ మెక్‌కలమ్‌ (2,140), పాక్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌ (2,039) మాత్రమే రెండు వేల పరుగుల మైలు రాయిని అందుకున్నారు. తాజాగా ఈ క్లబ్‌లో విరాట్‌ కోహ్లీ వచ్చి చేరాడు.

మంగళవారం ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో అతడు 8 పరుగులు సాధించడంతో ఈ జాబితాలో చేరిపోయాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గప్తిల్‌(73), మెక్‌కలమ్‌(71), మాలిక్‌(93)ల కంటే కోహ్లీ అతి తక్కువ ఇన్నింగ్స్‌ల ద్వారానే ఈ క్లబ్‌లో చేరాడు. ఇప్పటి వరకు 60 మ్యాచ్‌లాడిని కోహ్లీ 56 ఇన్నింగ్స్‌ల ద్వారా 2,012 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన విజయం సాధించి ఇంగ్లాండ్‌ పర్యటనకు శుభారంభాన్ని ఇచ్చింది. టోర్నీలో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో టీ20 శుక్రవారం జరగనుంది.

Untitled Document
Advertisements