అన్నా అన్న వదల్లేదు..

     Written by : smtv Desk | Fri, Jul 06, 2018, 04:37 PM

అన్నా అన్న వదల్లేదు..

ఢిల్లీ, జూలై 6 : దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చిన కొంత మందిలో మార్పు రావడం లేదు. అప్పటిలో నిర్భయ ఘటన తర్వాత నిర్భయ చట్టం తీసుకురాగానే హమ్మయ్య ఆడపిల్లకు భరోసా దొరికిందనుకున్నాం. అయితే, ఆడుతూపాడుతూ తిరిగే బాలికల మీద అత్యాచారానికి పాల్పడుతుండటంతో అమ్మలందరూ ఆక్రోశించారు. అలాంటి మృగాళ్లకు ఉరివేస్తామంటూ పోక్సో చట్టం తెచ్చారు. అయితే ఏ చట్టం శిక్ష పడుతుందన్న భయం ఏ ఒక్కరికి కలిగించలేకపోతోంది. అందుకే ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో మరో యువతి ఇలాంటి అన్యాయానికి బలైంది. అన్నా.. అని వేడుకున్నా వారి మనసు కరగలేదు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో కనిపించడం విషాదం.

ఉన్నావ్‌కు చెందిన ఓ యువతిని కొందరు దుర్మార్గులు ఇంటి సమీపంలోని అటవీప్రాంతంలోకి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్నానికి పాల్పడ్డారు . 'గట్టిగా అరిస్తే చెప్పుతో కొడతామని బెదిరించటం...' దానికి ఆ మహిళ ‘అన్నా.. వదిలేయండని ఆర్తనాదాలు చేస్తూ వేడుకున్న’ దృశ్యాలు ఉన్నా‍యి. అయినా కామాంధులు కనికరించకపోవటంతో చివరికి ఆ మహిళ ఎలాగోలా తప్పించుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు ఆ వీడియోలోని వ్యక్తుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ‘ఉన్నావ్‌కు చెందిన ఓ యువతి మీద అత్యాచారానికి పాల్పడుతోన్న వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో కనిపించింది. అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఎంతకాలం కిందటిది అనే విషయాన్ని పరిశీలిస్తున్నాం. మేజిస్ట్రేట్ నుంచి అనుమతి తీసుకొని ఆమె నుంచి ప్రమాద వివరాలు సేకరిస్తాం’ అని ఎస్పీ అనూప్‌ సింగ్ తెలిపారు.





Untitled Document
Advertisements