ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ : బుమ్రా స్థానంలో శార్దుల్..

     Written by : smtv Desk | Fri, Jul 06, 2018, 05:09 PM

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ : బుమ్రా స్థానంలో శార్దుల్..

ఢిల్లీ, జూలై 6 : వేలి గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టీ20, వన్డే సిరీస్‌కు జస్‌ప్రీత్ బుమ్రా దూరమైన సంగతి తెలిసిందే. బూమ్రా ఇంకా గాయం నుంచి కోలుకోపోవడంతో అతనికి వన్డే సిరీస్‌ నుంచి విశ్రాంతి ఇస్తున్నట్లు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) పేర్కొంది. ఇంగ్లండ్‌తో టీ-20 సిరీస్‌కు ముందు గాయపడిన బూమ్రా.. ప్రస్తుతం చేతికి వేలికి చికిత్స చేయించుకుని బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ పర్యవేక్షణలో ఉన్నాడు. బూమ్రా గాయం నుంచి కోలుకోవడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో అతని స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌కు అవకాశం కల్పిస్తూ బీసీసీఐ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకుంది. శార్దూల్‌కు అవకాశం కల్పిస్తున్న విషయాన్ని బీసీసీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

ఐర్లాండ్‌తో తొలి టి20 సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో బుమ్రా ఎడమ వేలికి గాయమైన సంగతి తెలిసిందే. దాంతో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు బూమ్రా స్థానంలో దీపక్‌ చాహర్‌కు అవకాశం కల్పించారు. అయితే వన్డే సిరీస్‌ సమయానికి బూమ్రా అందుబాటులోకి వస్తాడని భావించారు. కాగా, అతని గాయానికి చికిత్స జరగడంతో మరికొద్ది రోజులు జట్టుకు దూరంగా ఉండనున్నాడు.

టీమిండియా వన్డే జట్టు..

విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సురేశ్‌ రైనా, ఎంఎస్‌ ధోని, దినేశ్‌ కార్తీక్‌, యజ్వేంద్ర చాహల్‌, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, శార్దూల్‌ ఠాకూర్‌, హార్దిక్‌ పాండ్యా, ఉమేశ్‌ యాదవ్‌

Untitled Document
Advertisements