'హ్యాపీ బర్త్ డే' మిస్టర్ కూల్..

     Written by : smtv Desk | Sat, Jul 07, 2018, 12:12 PM

'హ్యాపీ బర్త్ డే' మిస్టర్ కూల్..

ఢిల్లీ, జూలై 7 ‌: టీమిండియా మాజీ సారథి, మహేంద్ర సింగ్ ధోని ఈ రోజు తన 37వ పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ధోనికు సామాజిక మాధ్యమాల వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ప్రస్తుతం ధోని కుటుంబంతో సహా విదేశాల్లో ఉన్నాడు. కాగా మహి పుట్టిన రోజును టీమిండియా క్రికెటర్లు ఘనంగా జరిపారు. ఈసందర్భంగా పాండ్య బ్రదర్స్‌ ‘హ్యాపీ బర్త్‌డే మహీ’ అంటూ పాడుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అది ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఈ సందర్భంగా ధోనీ భార్య సాక్షితో సహా పలువురు క్రికెటర్లు, బాలీవుడ్‌ ప్రముఖులు ట్వీట్లు చేశారు.

>> సాక్షి సింగ్‌ రావత్‌ (ధోనీ భార్య)

'హ్యాపీ బర్త్‌ డే టూయూ! నువ్వెంత గొప్ప వ్యక్తివో చెప్పడానికి మాటలు సరిపోవు. గత పదేళ్లుగా నీ నుంచి చాలా నేర్చుకుంటున్నాను. ఇదిలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతో ప్రేమతో నా జీవితాన్ని ఆనందమయం చేసిన నీకు ధన్యవాదాలు.'

>> వీరేంద్ర సెహ్వాగ్‌

'ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ జీవితం ఇప్పటి కంటే ఇంకా సంతోషంగా ఉండాలి. నీ స్టంపింగ్‌ కంటే జీవితంలో నువ్వు సాధించే విజయాలే వేగంగా ఉండాలి. 'ఓం ఫినిషాయ నమః!'

>> సురేశ్‌ రైనా

'500అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రయాణం. నీలాంటి లెజెండ్‌ పుట్టినందుకు భారతావని గర్విస్తోంది. హ్యాపీ బర్త్‌డే ధోనీ బ్రదర్‌. నువ్వేనాకు స్ఫూర్తి. అది ఎప్పటికీ అలాగే కొనసాగుతుంది. నీతో ఉన్న అన్ని సమయాలను నేనెప్పుడూ గుర్తు పెట్టుకుంటాను. నీలాగ ఎవ్వరూ ఉండలేరు మ్యాన్‌!'

>> రవీంద్ర జడేజా

' పుట్టిన రోజు శుభాకాంక్షలు ధోనీ. మాకు ఎన్నో ట్రోఫీలు తెచ్చిపెట్టినందుకు నీకు ధన్యవాదాలు.'

Untitled Document
Advertisements