వైరల్ : ధోనీ కేక్ ఎలా కట్ చేశారో చూడండి..

     Written by : smtv Desk | Sun, Jul 08, 2018, 01:59 PM

వైరల్ : ధోనీ కేక్ ఎలా కట్ చేశారో చూడండి..

న్యూఢిల్లీ, జూలై 8 : టీమిండియా మాజీ సారథి, మహేంద్ర సింగ్ ధోని నిన్న 37వ పుట్టిన రోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు సామాజిక మాధ్యమాల వేదికగా జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ధోని కుటుంబంతో సహా విదేశాల్లో ఉన్నాడు. మహి పుట్టిన రోజును పురస్కరించుకొని టీమిండియా క్రికెటర్లు ఘనంగా జరిపారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ధోనీకి సర్‌ప్రైజ్‌ ఇచ్చి౦ది. తన అధికారిక ట్విటర్ ఖాతా నుంచి బీసీసీఐ ఓ వీడియోను పోస్ట్‌ చేసింది.

ఈ వీడియోలో టీమిండియా క్రికెటర్లతో పాటు ధోనీ గారాలపట్టి జీవా కూడా ఉంది. అయితే పుట్టిన రోజు సందర్భంగా ధోనీ కేక్‌ కట్‌ చేస్తున్నప్పటి మరో వీడియోను బీసీసీఐ ట్విట్‌ చేసింది. ఇందులో ధోనీ కేక్‌ కట్‌ చేసిన విధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ధోనీ కేక్‌ను మామూలుగా కట్‌ చేయకుండా కత్తిని పైకెత్తి బలంగా నరుకుతున్నట్లు కేక్‌ను కట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకరిస్తుంది. అంతేకాదు విపరీతమైన లైకులు, కామెంట్స్ వస్తున్నాయి. "ధోనీ ఆటలోనే కాదు.. కేక్‌ కట్‌ చేయడం కూడా వినూత్నమే" అంటూ ఒకరు., "అది బ్యాట్‌ కాదు భయ్యా.. కత్తి‌" అంటూ ఇలా పలువురు కామెంట్లు చేస్తున్నారు.

#TeamIndia has reached Bristol and upon arrival it is time to celebrate#HappyBirthdayMSDhoni pic.twitter.com/298C0Ti9eQ

— BCCI (@BCCI) July 7, 2018


Untitled Document
Advertisements