లువాంగ్‌ గుహ నుంచి నలుగురు చిన్నారుల వెలికితీత..

     Written by : smtv Desk | Sun, Jul 08, 2018, 06:49 PM

లువాంగ్‌ గుహ నుంచి నలుగురు చిన్నారుల వెలికితీత..

బ్యాంకాక్, జూలై 8 : థాయిలాండ్‌ లోని థామ్‌ లూవాంగ్‌ గుహలో చిక్కుకుపోయిన 13 మంది(12 మంది పిల్లలు+వారి ఫుట్‌బాల్‌ కోచ్‌)ని కాపాడేందుకు సహాయక సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాలను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో దాదాపు 4కిలోమీటర్లు ప్రయాణించిన వీరిలో నలుగురిని తాజాగా సహాయక బృందాలు రక్షించాయి. నేడు వాతావరణం కాస్తంత తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలను వేగవంతం చేశారు.

ఈ మేరకు చియాంగ్‌ రే ‌హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ బూనతోంగ్‌ స్పందిస్తూ.. 'నలుగురు బాలురు బయటకు వచ్చారు. ప్రస్తుతం వారికి వైద్యసేవలు అందించేందుకు గుహవద్ద ఏర్పాటు చేసిన ఫీల్డ్‌ హాస్పటల్‌కు తరలించా౦' అని తెలిపారు. ఇందుకోసం సహాయక సిబ్బంది చిన్నారులు ఉన్న ప్రదేశానికి సమీపంలోనే గుహకు డ్రిల్లింగ్‌ చేసి వాటి ద్వారా గొట్టాలను పంపిస్తున్నారు.

ఇప్పటి వరకు దాదాపు 400 మీటర్ల వరకూ డ్రిల్లింగ్‌ చేశారు. మిగతా వారిని సైతం సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. జూన్‌ 23న థాయ్‌ లుయాంగ్‌ గుహని సందర్శించేందుకు వెళ్లిన 12 మంది చిన్నారులు, ఫుట్‌బాల్‌ కోచ్‌ చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారిని కాపాడేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గుహలో నీటిమట్టం, బురద బాగా పెరగడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.

Untitled Document
Advertisements