ఎనిమిదేళ్లు గాలించారు.. ఎట్టకేలకు పట్టుకొన్నారు..

     Written by : smtv Desk | Tue, Jul 10, 2018, 03:25 PM

ఎనిమిదేళ్లు గాలించారు.. ఎట్టకేలకు పట్టుకొన్నారు..

సిడ్నీ, జూలై 10 : దాదాపు 4.7 మీటర్లు(15.4 అడుగులు), బరువు 600 కిలోలు గల నరమాంస పిపాసి అయిన రాకాసి ఉప్పునీటి మొసలిని ఆస్ట్రేలియా అధికారులు మంగళవారం పట్టుకున్నారు. భయంకరమైన ఈ మొసలి కోసం ఆస్ట్రేలియా అధికారులు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిదేళ్లు గాలించి చివరకు పట్టుకొన్నారు. క్యాథరిన్‌ నదిలోని బ్యాక్‌ వాటర్స్‌లో ఉండే ఈ మొసలి పలుమార్లు స్థానికులపై దాడులు చేసింది. ఉప్పు నీటి మొసళ్లు సాధారణంగా సైజులో భారీగానే ఉంటాయి. అయితే, క్యాథరిన్‌ నదిలో ఇప్పటివరకూ దొరికిన మొసళ్లలో ఇదే అతిపెద్దది కావడం విశేషం.

1970లలో మొసళ్లను సంరక్షించాల్సిన జాతుల జాబితాలో చేర్చడంతో అప్పటి నుంచి వాటి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆస్ట్రేలియాలో ఏటా 250కి పైగా ఉప్పు నీటి మొసళ్లు కనీసం ఇద్దరు వ్యక్తులనైనా చంపుతున్నాయి. దీంతో వీటి సంతతిని అరికట్టడానికి అక్కడి వైల్డ్‌ లైఫ్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మకంగా మారిన మొసళ్లను పట్టుకుని క్రోకోడైల్స్‌ ఫార్మ్‌లో ఉంచుతున్నారు.





Untitled Document
Advertisements