థాయ్‌లాండ్‌ గుహ : అందరూ సురక్షితం..

     Written by : smtv Desk | Tue, Jul 10, 2018, 05:35 PM

థాయ్‌లాండ్‌ గుహ : అందరూ సురక్షితం..

మే సాయి, జూలై 10 : థాయ్‌లాండ్‌లోని తామ్‌ లువాంగ్‌ గుహలో చిక్కుకున్నవారి కోసం చేపట్టిన సహాయక చర్యలు విజయవంతమయ్యాయి. డైవర్ల సహాయంతో ఆదివారం నలుగురు, సోమవారం నలుగురు బాలురు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. మూడు రోజులుగా జరుగుతున్న సహాయక చర్యల వల్ల పన్నెండు మంది బాలురు, కోచ్ బయటకు వచ్చారు. ఇప్పటి వరకు బయటకు వచ్చిన చిన్నారులను అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి వివరాలను ఇంకా బయటపెట్టడం లేదు.

గుహ నుంచి బయటకు వచ్చిన పన్నెండు మంది చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని బయటకు తీసుకు రాగానే వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. గుహలో ఉన్న 13 మందినీ బయటకు తీసుకొచ్చామని నలుగురు డైవర్లు గుహ నుంచి బయటకు వస్తున్నారని థాయ్ నేవీ సీల్స్ వెల్లడించాయి. సహాయక చర్యలు చివరి దశకు చేరుకున్నాయి. సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న నలుగురు ఈతగాళ్లు, ఒక డాక్టర్ ఇంకా గుహలోనే ఉండిపోయారు. వారు బయటకు రాగానే ఆపరేషన్ ముగుస్తుంది





Untitled Document
Advertisements