అఫ్గాన్ ప్రభుత్వ భవనంపై ఉగ్రదాడి..

     Written by : smtv Desk | Wed, Jul 11, 2018, 04:53 PM

 అఫ్గాన్ ప్రభుత్వ భవనంపై ఉగ్రదాడి..

జలాలాబాద్, జూలై 11 ‌: అఫ్గానిస్థాన్‌లోని జలాలాబాద్‌ ప్రావిన్స్‌లోని నంగ్రహార్‌లోని ప్రభుత్వ విద్యావిభాగ భవనంపై ఉగ్రవాదులు దాడి జరిపారు. ఈ భవనంలోని చొరబడిన ఉగ్రవాదులు అందులోని ఉద్యోగులను, ప్రజలను బందీలుగా చేసుకున్నారు. దీంతో అఫ్గానిస్థాన్‌ భద్రతా దళాలు అక్కడకు చేరుకొని ఉగ్రవాదులతో పోరాటానికి దిగాయి. ఇప్పటివరకు ఈ ఎన్‌కౌంటర్‌లో 11మంది మృతి చెందగా.. మరో 10మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పిల్లలు కూడా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోంది.

భవనంలో కచ్చితంగా ఎంత మంది చిక్కుకుపోయారనే విషయాన్ని అధికారులు చెప్పలేకపోతున్నారు. ఇప్పటివరకు ఈ పోరులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరు తనను తాను పేల్చుకొని మరణించగా, మరొకరిని భద్రతా దళాలు కాల్చి చంపాయి. ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థా కూడా ప్రకటన చేయలేదు.

Untitled Document
Advertisements