చైనాలోని రసాయన కర్మాగారంలో భారీ పేలుడు..

     Written by : smtv Desk | Fri, Jul 13, 2018, 05:53 PM

చైనాలోని రసాయన కర్మాగారంలో భారీ పేలుడు..

బీజింగ్, జూలై 13 ‌: చైనాలో విషాదం చోటుచేసుకుంది. చైనాలోని యిబిన్‌ హెంగ్డా టెక్నాలజీ రసాయనిక కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 19 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటీన దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పేలుడు జరగడానికి గల కారణాలు తెలియరాలేదు. పది నిమిషాల వ్యవధిలోనే ఏడు పేలుళ్ల శబ్దాలు విన్నట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు మీడియాకు వెల్లడించారు. పేలుడు ధాటికి కర్మాగారం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. పేలుడు ధాటికి కర్మాగారం పక్కనే ఉన్న భవనాల అద్దాలు పగిలిపోయాయి.

ఈ పేలుడుకు సంబంధించిన ఫొటోలు చైనా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకున్నట్లు చిత్రాల్లో కనిపిస్తోంది. దీనిపై స్పందించేందుకు కర్మాగార యాజమాన్యం సిద్ధంగా లేదు. ‘భారీ శబ్ధం వినిపించింది. చాలా పెద్దగా సౌండ్‌ వచ్చింది. భూమి కంపించిందేమోనని అనుకున్నాను’ అని కర్మాగారంలో పనిచేసిన కార్మికులు చెప్పారు.





Untitled Document
Advertisements