కెప్టెన్ కోహ్లి @ ఫిఫ్టీ..

     Written by : smtv Desk | Fri, Jul 13, 2018, 06:28 PM

కెప్టెన్ కోహ్లి @ ఫిఫ్టీ..

నాటింగ్‌హమ్‌, జూలై 13 : భారత్ క్రికెట్ సారథి విరాట్‌ కోహ్లి మరో అరుదైన ఘనతను సాధించాడు. గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌.. కెప్టెన్‌గా కోహ్లికి 50వ వన్డే మ్యాచ్‌. దీంతో ఈ ఫీట్‌ అందుకున్న 7వ భారత బ్యాట్స్‌మన్‌గా ఈ 29 ఏళ్ల ఆటగాడు గుర్తింపు పొందాడు. 50 మ్యాచ్‌ల్లో 39 విజయాలందించి.. తొలి 50 వన్డేలకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించి ఎక్కువ విజయాలు నమోదు చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో కోహ్లి మూడో స్థానంలో నిలిచాడు.

ఆసీస్‌ మాజీ సారథి రికీ పాంటింగ్‌ 41 విజయాలతో మొదట స్థానంలో ఉండగా, వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ క్లైవ్‌ ల్యూయిడ్‌ 40 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు. గతేడాది జనవరిలో మహేంద్రసింగ్‌ ధోని నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో విరాట్ ఆ అవకాశం దక్కిన విషయం తెలిసిందే. భారత్‌ పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ ద్వారా కోహ్లి పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ సిరీస్‌ను భారత్‌ 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

Untitled Document
Advertisements