శ్రీవారి దర్శనానికి బ్రేక్..

     Written by : smtv Desk | Sat, Jul 14, 2018, 12:27 PM

శ్రీవారి దర్శనానికి బ్రేక్..

తిరుపతి, జూలై 14 : తిరుమల తిరుపతి దేవస్థానం ప(టీటీడీ) పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకొంది. ఆగస్టు 9వ తేదీ సాయంత్రం నుంచి 17 వరకు భక్తులకు స్వామివారి దర్శనాన్ని నిలిపేస్తున్నట్లు టీటీడీ ఛైర్మెన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ వెల్లడించారు. శనివారం టీటీడీ ఆలయ అధికారులతో అత్యవసర సమావేశం జరిగింది. అనంతరం ఆలయ చైర్మెన్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 11న అంకురార్పణ ఉంటుందని, 12వ తేదీ నుంచి 16 తేదీ వరకూ శ్రీవారి ఆలయంలో అష్ట బంధన బాలాలయ మహా సం‍ప్రోక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ సంప్రోక్షణలో దాదాపు 30 వేల మంది భక్తులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ తొమ్మిది రోజల పాటు కొండపైకి భక్తులను అనుమతించేది లేదని పుట్టా స్పష్టం చేశారు. టీటీడీ నిర్ణయంపై భక్తులు తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ అధికారులపై మండిపడుతున్నారు. తొమ్మిది రోజుల పాటు భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం ఉండదు. మహా సంప్రోక్షణ జరపాలన్న ఆగమ పండితుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.





Untitled Document
Advertisements