'విజేత'ను అభినందించిన మెగాస్టార్..

     Written by : smtv Desk | Sat, Jul 14, 2018, 12:49 PM

'విజేత'ను అభినందించిన మెగాస్టార్..

హైదరాబాద్, జూలై 14 : మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ 'విజేత' సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యారు. రాకేశ్ శశి ద‌ర్శ‌కత్తం వహి౦చిన ఈ చిత్రాన్ని వారాహి సంస్థ‌ బ్యానర్ లో సాయి కొర్ర‌పాటి, ర‌జినీ కొర్ర‌పాటి నిర్మించారు. మాళవిక నాయర్ కథానాయికగా నటించి౦ది. కళ్యాణ్ దేవ్ కు ఇది తొలి చిత్రమే అయినా.. అభిమానుల అంచనాలను అందుకోగలిగాడు. అన్ని ప్రాంతాల నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. లుక్ పరంగా.. నటన పరంగా కల్యాణ్ దేవ్ కు మంచి మార్కులే పడ్డాయి.

తాజాగా ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి.. నిర్మాత సాయికొర్రపాటిని ప్రశంసించారట. తొలి సినిమానే అయినా ఎలాంటి ఒత్తిడి లేకుండా బాగా చేశావంటూ అల్లుడు కల్యాణ్ దేవ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే రామ్ చరణ్ కూడా సినిమా బాగుందంటూ కల్యాణ్ దేవ్ ను మెచ్చుకున్నారు. దీంతో తనకి చాలా సంతోషంగా ఉందని కల్యాణ్ దేవ్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు కళ్యాణ్. ఇదే ఊపుతో కళ్యాణ్ దేవ్.. ఆయన రెండవ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చేస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.





Untitled Document
Advertisements