ఫోటోలంటే వణుకు..

     Written by : smtv Desk | Sat, Jul 14, 2018, 01:06 PM

ఫోటోలంటే వణుకు..

హైదరాబాద్, జూలై 14 : యంగ్ టైగర్ ఎన్టీఆర్.. సెలెక్ట్ మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఎన్టీఆర్.. తన తొలి మొబైల్.. హైదరాబాద్ అబిడ్స్ లోని జగదీష్ మార్కెట్లో కొన్నానని.. అదే తన మొదటి మొబైల్ అని తెలిపారు.

అలాగే ఫోన్ ఎక్కువగా వాడుతుంటారా.? ఫొటోలు ఎక్కువగా దిగుతుంటారా?.. అనే ప్రశ్నకు బదులిస్తూ.. 'నేను ఫొటోలు చాలా తక్కువగా దిగుతుంటాను. నాకు పోజ్ ఇవ్వడం నచ్చదు. అదంటే నాకు వణుకు వస్తుంది. నా భార్య కూడా నా ఫొటోలు తీస్తాన౦టుంది. కానీ, నాకేమో పోజులివ్వడం రాదు' అని చెప్పుకొచ్చాడు.

'బిగ్ బాస్' రెండవ సీజన్ లో నాని పెర్ఫామెన్స్ గురించి ఏమనుకుంటున్నారు.? అనే ప్రశ్నకు.. "నాని గొప్ప నటుడు. చాలా గొప్పగా చేస్తున్నాడు. ఆయన గురించి మీరు నన్ను అడగటం తప్పు. 'బిగ్‌బాస్‌' విజయవంతమైన ప్లాట్‌ఫాం. దానికి అంతం లేదని నా అభిప్రాయం" అంటూ పేర్కొన్నారు.





Untitled Document
Advertisements