'ఆటగదరా శివ' లిరికల్ సాంగ్ బై.. పవన్

     Written by : smtv Desk | Sat, Jul 14, 2018, 06:07 PM

'ఆటగదరా శివ' లిరికల్ సాంగ్ బై.. పవన్

హైదరాబాద్, జూలై 14 : 'ఆ నలుగురు', సినిమా తీసిన చంద్ర సిద్దార్థ.. ప్రస్తుతం 'ఆటగదరా శివ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రాక్‌లైన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రాక్‌లైన్ వెంక‌టేశ్ నిర్మిస్తున్నారు. ఉద‌య్ శంక‌ర్ క‌థానాయ‌కుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 14న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమాకి వాసుకి వైభవ్ సంగీతాన్ని అందించారు. అయితే ఈ సినిమాలోని ఓ పాటను పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ చేతుల మీదుగా విడుదల చేయిస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

ఈ మేరకు ఈ విషయాన్ని ట్విట్టర్ లో.. "పవన్‌ కళ్యాణ్‌ 'ఎట్టాగయ్యా శివ' అనే లిరికల్‌ సాంగ్‌ను శనివారం సాయంత్రం ఆరుగంటలకు విడుదల చేయనున్నారు" అని రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ట్వీట్ చేసింది. ఇదివరకే ఈ చిత్రంలోని ఒక పాటను విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. కాగా ఈ చిత్రాన్ని జూలై 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఉరిశిక్ష నుంచి త‌ప్పించుకుని ఓ ఖైదీ.. అనుకోకుండా త‌న‌ను ఉరితీయాల్సిన తలారినే క‌లుస్తాడు. వాళ్లెవ‌ర‌న్న విష‌యం ప‌ర‌స్ప‌రం తెలియ‌క‌పోవ‌డంతో క‌లిసి ప్ర‌యాణం చేస్తారు. ఆ ప్ర‌యాణంలో వాళ్ల‌కు ఎదుర‌య్యే అనుభ‌వాలు ఏంటి? వాళ్లు ఎవ‌రెవ‌రిని క‌లిశారు? అనేది మా సినిమాలో ఆస‌క్తిక‌ర‌మైన అంశంగా తెలుస్తోంది.





Untitled Document
Advertisements