'లవర్' థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

     Written by : smtv Desk | Sat, Jul 14, 2018, 06:51 PM

'లవర్' థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

హైదరాబాద్, జూలై 14 : యువ హీరో రాజ్ తరుణ్.. అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న 'లవర్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ సమర్పిస్తోంది. హర్షిత్‌ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మంచి ప్రేమకథాంశంతో నిర్మితమైన ఈ సినిమా ద్వారా 'రిద్ధి కుమార్' కథానాయికగా పరిచయమవుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. టీజర్ లో క్లాస్ గా కనిపించినా.. ట్రైలర్ లో అటు క్లాస్, మాస్ ను కలిపి చూపించాడు.

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఈ మధ్య రాజ్ తరుణ్ సినిమాలు ఆఫీస్ వద్ద సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాయి. ఈ సంక్రాంతికి వచ్చిన 'రంగుల రాట్నం' కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇటీవల ఈ 'రాజుగాడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది కూడా సరైన ఫలితం ఇవ్వలేదు. కనీసం ఈ సినిమాతోనైనా సక్సెస్ ట్రాక్ లోకి రావాలని రాజ్ తరుణ్ భావిస్తున్నాడు. ఈ చిత్రం తనకు మంచి ఫలితాన్ని ఇవ్వాలని ఆశిద్దాం.





Untitled Document
Advertisements