దైర్యం ఉంది కాబట్టే.. ఇంత బోల్డ్ గా..

     Written by : smtv Desk | Sun, Jul 15, 2018, 11:58 AM

దైర్యం ఉంది కాబట్టే.. ఇంత బోల్డ్ గా..

హైదరాబాద్, జూలై 15 : విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'RX 100' సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమాకు అజయ్‌ భూపతి దర్శకత్వం వహించగా కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా నటించారు. రాంకీ, రావు రమేశ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా చూసేందుకు యువ‌త థియేట‌ర్ల వ‌ద్ద బారులు తీరుతోంది. ఇందులో హీరోయిన్ గా తన అందాలను ఆరబోసిన పాయల్ రాజ్ పుత్, ఇంత బోల్డ్ గా నటించాలంటే ఎంతో ధైర్యం ఉండాలని, తనకా ధైర్యం ఉందని చెబుతోంది.

ఒకరకంగా చెప్పాలంటే సినిమాకి పాయల్ రాజ్‌పుతే స్పెషల్ అట్రాక్షన్ అయింది. తన క్యారెక్టర్ గురించి పాయల్ మాట్లాడుతూ.. ఎంతో మంది హీరోయిన్లు ఈ పాత్రను నిరాకరించారని, ఈ క్యారెక్టర్ చేయాలంటే ఎంతో సాహసం ఉండాలి అంటోంది. కానీ తాను మాత్రం భయపడకుండా సినిమాకు ఓకే చెప్పానని చెప్తోంది. ఇంతకు ఈ సినిమా కోసం పాయల్ తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా..! కేవలం 6 లక్షలు మాత్రమేనట. అంత తక్కువ పారితోషికం తీసుకున్న ఈ బ్యూటీ కెమెరా ముందు అందాల ఆరబోతలో మాత్రం వెనకాడలేదని ప్రేక్షకులు పాజిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు.





Untitled Document
Advertisements