సూర్య.. సెకండ్ షెడ్యూల్ పొల్లాచ్చిలో..

     Written by : smtv Desk | Sun, Jul 15, 2018, 12:21 PM

సూర్య.. సెకండ్ షెడ్యూల్ పొల్లాచ్చిలో..

హైదరాబాద్, జూలై 15 : హీరో సూర్య ప్రస్తుతం పొల్లాచ్చిలో ఉన్నారు. తన 37వ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ ను ఇటీవలే లండన్ లో పూర్తిచేశారు. తాజాగా ఈ సినిమా రెండవ షెడ్యూల్ ను 'పొల్లాచ్చి'లో ప్లాన్ చేశారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు.

ప్రస్తుతం సూర్య.. కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో సూర్య జోడిగా సాయేషా సైగల్ నటిస్తోంది. ఈ సినిమాలో మోహన్ లాల్, బొమన్ ఇరాని, అల్లు శిరీష్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రను హీరో ఆర్య పోషిస్తుండడం విశేషం.





Untitled Document
Advertisements