కరణ్ జీత్ 'కౌర్' కష్టాలు..

     Written by : smtv Desk | Sun, Jul 15, 2018, 01:41 PM

కరణ్ జీత్ 'కౌర్' కష్టాలు..

ముంబై, జూలై 15 : బాలీవుడ్‌ ప్రముఖ నటి సన్నీ లియోనీ జీవితంలో జరిగిన యదార్థ ఘటనతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. "కరణ్‌జీత్‌ కౌర్‌: ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్ సన్నీ లియోనీ" పేరిట ఓ బయోపిక్‌.. వెబ్‌సీరీస్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఆదిలోనే కష్టాలు ఎదురయ్యాయి. ఈ వెబ్ సిరీస్.. టైటిల్‌ విషయంలో శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ(ఎస్‌జీపీసీ) అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. టైటిల్‌లో 'కౌర్'ను అంగీకరించే ప్రసక్తే లేదని, వెంటనే తొలగించాలని అల్టిమేటం జారీ చేసింది.

'కౌర్' వల్ల సిక్కుల మనోభావాలు దెబ్బతింటాయని ఎస్‌జీపీసీ అడిషనల్ సెక్రటరీ, అధికార ప్రతినిధి దల్జీత్ సింగ్ బేడీ అన్నారు. 'కౌర్' అనే పదం చాలా పవిత్రమైనదని.. సిక్కు బోధనలను పాటించని వారికి ఆ పదాన్ని ఉపయోగించుకునే అర్హత లేదన్నారు. ఈ పదాన్ని సన్నీలియోన్ ఉపయోగించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఎందుకంటే సిక్కు మత విశ్వాసాలను సన్నీలియోన్ పాటించడం లేదని.. ఆమెకు ఈ పేరు వాడే అర్హత లేదన్నారు. సన్నీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సిక్కులు డిమాండ్ చేస్తున్నారు.





Untitled Document
Advertisements