ఇళ్లకు వెళ్లనున్న 'థాయ్‌' బాలురు..

     Written by : smtv Desk | Sun, Jul 15, 2018, 01:52 PM

ఇళ్లకు వెళ్లనున్న 'థాయ్‌' బాలురు..

బ్యాంకాక్‌, జూలై 15 : థాయ్‌లాండ్‌లోని థామ్‌ లువాంగ్‌ గుహలో చిక్కుకుని 18 రోజుల నరకం తర్వాత బయటపడిన పిల్లలు, వారి ఫుట్‌బాల్‌ జట్టు కోచ్‌ను ఆసుపత్రి నుంచి గురువారం (19న) ఇళ్లకు పంపించానున్నారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యాక మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడపాలని వైద్యులు బాలురకు సూచించారు. ఆ గుహలో సంఘటనలను గుర్తు చేసుకోవడం వారి మానసిక ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు తెలిపారు.

రెండు వారాలకు పైగా గుహలో ఉన్నందున ఏవైనా ఇన్‌ఫెక్షన్లు సోకి ఉంటాయేమోనన్న అనుమానంతో వారందరినీ ముందుగా వైద్యులు ఓ ప్రత్యేకమైన వార్డులో ఉంచారు. జూన్‌ 23న థాయ్‌ లుయాంగ్‌ గుహని సందర్శించేందుకు వెళ్లిన 12 మంది చిన్నారులు, ఫుట్‌బాల్‌ కోచ్‌ చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారిని కాపాడేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించి అందరిని బయటకు తీశారు.

Untitled Document
Advertisements