బాహుబలి ఒక వైపు.. మిగతావన్నీ మరో వైపు..

     Written by : smtv Desk | Sun, Jul 15, 2018, 06:56 PM

బాహుబలి ఒక వైపు.. మిగతావన్నీ మరో వైపు..

ముంబై, జూలై 15 : బాలీవుడ్‌లో ఇటీవల వచ్చిన ‘సంజు’ సినిమాకు కూడా విశేష ఆదరణ లభించింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.300 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. ఈ ఘనత సాధించిన అతి కొన్ని సినిమాల జాబితాలో ఇది నిలిచింది. ఈ ఏడాది ఇంత మొత్తం రాబట్టిన రెండో చిత్రమిది. సంజయ్ దత్ జీవితకథ ఆధారంగా ..రాజ్ కుమార్ హిరణీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాలో రన్ బీర్ కపూర్ హీరోగా నటించారు. 2018 జనవరిలో విడుదలైన ‘పద్మావత్‌’ కూడా దేశవ్యాప్తంగా రూ.300 కోట్లు రాబట్టి.. రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో విక్కీ కౌశల్‌, మనీషా కొయిరాలా, పరేశ్‌ రావల్‌, సోనమ్‌ కపూర్‌, అనుష్క శర్మ, దియా మీర్జా, టబు, షియాజీ షిండే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎ.ఆర్‌. రెహమాన్‌ స్వరాలూ సమకూర్చారు.

ఈ ఏడాది బాలీవుడ్‌ బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలవడంతో పాటు అత్యంత భారీ వసూళ్లను రాబట్టి ఈ ఏడాది హయ్యెస్ట్‌ ఓపెనర్‌గా నిలిచింది. అంతేకాదు రణ్‌బీర్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ ఓపెనర్‌గా కూడా నిలిచి రికార్డు సృష్టించింది. అయితే 2017లో వచ్చిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ (హిందీ) మైలురాయిని మాత్రం ఏ సినిమా దాటలేకపోయింది. ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ.500 కోట్లు రాబట్టి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. సినీ విశ్లేషకుల సమాచారం మేరకు దేశవ్యాప్తంగా రూ.300 కోట్లు క్లబ్‌లో చేరిన సినిమాల జాబితాను ఓ సారి చూస్తే..

రూ.300 కోట్లు..

* ‘పీకే’ (2014).

* ‘భజరంగీ బాయ్‌జాన్‌’ (2015).

* ‘సుల్తాన్‌’ (2016).

* ‘దంగల్‌’ (2016).

* ‘టైగర్‌ జిందా హై’ (2017).

* ‘పద్మావత్‌’ (2018).

* ‘సంజు’ (2018).

రూ.500 కోట్లు..

* ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ (2017).





Untitled Document
Advertisements