త్రివిక్రమ్ ఫోటో షేర్ చేసిన తమన్..

     Written by : smtv Desk | Sun, Jul 15, 2018, 07:11 PM

త్రివిక్రమ్ ఫోటో షేర్ చేసిన తమన్..

హైదరాబాద్, జూలై 15 : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో 'అరవింద సమేత' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నిరంతరాయంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర విరామంలో త్రివిక్రమ్.. చాలా కూల్ గా కనిపిస్తున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ తో తీసిన 'అజ్ఞాతవాసి' పరాజయంతో ఉన్న త్రివిక్రమ్ ఈ చిత్రంపై భారీ అంచనాలే పెట్టుకున్నారు.

తాజాగా ఆయన కిటీకీ పక్కన కూల్ గా కూర్చొని ఉన్న ఫోటోను మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఫోటో తో పాటు.. "మనతో పని చేసే డైరెక్టర్‌ కూల్‌గా మనతో ఉంటే.. మంచి కూల్‌ ట్రాక్స్‌ వస్తాయి.. నాకు ఆయనతో ప్రతిరోజూ కూల్‌గానే ఉంటుంది.. పాటలు పూర్తికావొస్తున్నాయి" అంటూ పోస్ట్‌ చేశాడు. జగపతి బాబు, ఈషా రెబ్బ, నవీన్ చంద్ర, రావు రమేష్ తదితరులు ముఖ్య భూమిక పోషిస్తున్నారు.





Untitled Document
Advertisements