53 మందిని కాపాడారు..

     Written by : smtv Desk | Mon, Jul 16, 2018, 11:29 AM

53 మందిని కాపాడారు..

సరుబుజ్జిలి, జూలై 16 : గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదుల్లో వరద నీరు పోటెత్తుతోంది. ఎగువన కురిసిన భారీ వర్షాలు కారణంగా శ్రీకాకుళం జిల్లా వంశధార నదిలో వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో గొట్టా బ్యారేజ్‌ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. దీంతో శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం సమీపంలో వంశధార నదిలో చిక్కుకుపోయిన 53 చిక్కుకుపోయారు. వంశధార నదీ గర్భంలో ఇసుక తరలింపు కోసం వెళ్లిన కూలీలు, డ్రైవర్లు వరద కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. ఒక్కసారిగా వంశధార నదిలో వరద ప్రవాహం అధికం కావడంతో వీరంతా చిక్కుకుపోయారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు సహాయచర్యలు చేపట్టారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది చాలా సమయం పాటు శ్రమించి వారిని ఒడ్డుకు చేర్చారు. బాధితులంతా క్షేమంగా ఒడ్డుకు చేరుకోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

అభినందనలు తెలిపిన సీఎం..

వంశధార నదిలో చిక్కుకున్న 53 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన అధికారులను సేఎం చంద్రబాబునాయుడు అభినందించారు. ఈ ఘటనపై సమాచారం తెలిసినప్పటి నుంచి ఆయన సహాయచర్యలను సమీక్షిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పడు సమాచారాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.





Untitled Document
Advertisements