ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..@ 78 లక్షలు

     Written by : smtv Desk | Mon, Jul 16, 2018, 01:43 PM

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..@ 78 లక్షలు

హైదరాబాద్, జూలై 16 : విజయ్ దేవర కొండ హీరోగా, పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'గీత గోవిందం'. ఈ చిత్రంలోని "ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... చాలే ఇది చాలే..." అనే ఓ పాటకు సంబంధించిన లిరికల్‌ టీజర్‌ను ఈ నెల 10న యూట్యూబ్‌లో చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాట కొద్ది రోజుల్లోనే విశేష ఆదరణను సంపాదించుకుంది. ఆరు రోజుల్లోనే ఈ పాటను 78 లక్షల మంది వీక్షించారు.‌ వినసొంపుగా ఉన్న ఈ పాటకు సంగీత దర్శకుడు గోపీ సుందర్‌ చక్కటి స్వరాలూ సమకూర్చారు. అనంత్‌ శ్రీరామ్‌ అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. తనదైన ముద్రతో సిద్‌ శ్రీరామ్‌ పాటను అద్భుతంగా ఆలపించారు. అతి తక్కువ సమయంలో ఈ పాటకు ఇంత క్రేజ్‌ లభించడంతో ‘గొప్పదనం పాటదా లేక విజయ్‌ దేవరకొండ ఫాలోయింగ్‌దా’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

పాటలో విజయ్‌ క్లాస్‌లుక్‌లో కనిపించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీ వాస్‌ నిర్మిస్తోన్న 'గీతగోవిందం' లో విజయ్‌ దేవరకొండ సరసన రష్మిక మందన జంటగా నటించారు. ఆగస్టు 15న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అతి తక్కువ సమయంలో ఈ పాటకు ఇంత క్రేజ్‌ లభించడంతో 'గొప్పదనం పాటదా లేక విజయ్‌ దేవరకొండ ఫాలోయింగ్‌దా' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పాటలో విజయ్‌ క్లాస్‌లుక్‌లో కనిపించారు.





Untitled Document
Advertisements