ప్రధాని ర్యాలీలో అపశ్రుతి..

     Written by : smtv Desk | Mon, Jul 16, 2018, 04:24 PM

ప్రధాని ర్యాలీలో అపశ్రుతి..

మిడ్నాపూర్, జూలై 16 : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ర్యాలీలో సోమవారం మధ్యాహ్నం అపశ్రుతి చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మిడ్నాపూర్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తుండగా అక్కడున్న టెంట్‌లోని కొంత భాగం కుప్పకూలింది. దీంతో సుమారు 20 మంది క్షతగాత్రులయ్యారు. గాయాలపడ్డ వారిని వెంటనే ద్విచక్ర వాహనాలు, అంబులెన్స్‌లలో ఆసుపత్రికి తరలించారు. ప్రధాని కాన్వాయ్ కూడా వారిని అనుసరించింది. క్షతగాత్రులకు తగిన సహాయం అందించాలంటూ ఎస్‌పీజీ సిబ్బందిని ప్రధాని ఆదేశించారు. ఉదయం వర్షం పడుతుండటం, టెంట్ కిక్కిరిసి పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

టెంట్‌కు సపోర్ట్‌గా ఉన్న పోల్స్ ఎక్కి కొందరు ప్రధానిని చూసేందుకు ఉత్సాహం చూపించడంతో టెంటులోని కొంత భాగం కూలిపోయింది. వెంటనే ప్రసంగాన్ని నిలిపివేసిన ప్రధాని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, స్టేజ్ దిగి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. 'పోల్స్ ఎక్కిన వాళ్లు కిందకు దిగండి. నిలబడిన వాళ్లు కిందకు రండి. పరుగులు తీయొద్దు' అంటూ ప్రధాని అప్రమత్తం చేశారు. అనంతరం క్షతగాత్రులను ఆసుపత్రికి వెళ్లి ప్రధాని పరామర్శించారు.





Untitled Document
Advertisements