ఫ్రాన్స్‌ యువ కెరటం ఎంబపె.. సంచలన ప్రకటన..

     Written by : smtv Desk | Tue, Jul 17, 2018, 01:28 PM

ఫ్రాన్స్‌ యువ కెరటం ఎంబపె..  సంచలన ప్రకటన..

పారిస్, జూలై 17 : ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్‌-2018ను ఫ్రాన్స్‌ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ జట్టు గెలుపులో యువ ఆటగాడు ఎంబపె కీలకపాత్ర పోషించాడు. ఫైనల్లో గోల్‌ కొట్టి ఫ్రాన్స్‌కు ఆధిక్యాన్ని కూడా అందించాడు. అంతేకాదు ప్రపంచకప్‌ ఫైనల్లో గోల్‌ కొట్టిన పిన్న వయస్కుడిగా కూడా ఎంబపె రికార్డు సృస్టించాడు. ఈ టోర్నీ ద్వారా తాను అందుకునే మొత్తాన్ని ఛారిటీకి ఇస్తున్నట్లు ప్రకటించి అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు. ప్రపంచకప్‌లో ఆడినందుకు ఒక్కో మ్యాచ్‌కు గాను అతడు 22,500 డాలర్ల(ఈ టోర్నీలో అతడు ఎనిమిది మ్యాచ్‌లు ఆడాడు)తో పాటు ఫైనల్‌లో విజేతగా నిలిచినందుకు సుమారు 3.5లక్షల డాలర్లను అదనంగా అందుకుంటాడు. దేశానికి అత్యున్నత సేవలు అందించిన వారికి ప్రకటించే లిజియన్‌ ఆఫ్‌ హానర్‌ అవార్డుతో ఆటగాళ్లను సత్కరించాలని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ నిర్ణయం తీసుకున్నారు.

ఫిఫా ప్రపంచకప్‌ టోర్నీ ద్వారా ఎంబపె సుమారు 5లక్షల డాలర్లను అందుకోన్నాడు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.3.4కోట్లకు పైనే. ఈ మొత్తాన్ని అతడు ఛారిటీకి ఇవ్వనున్నట్లు తెలిపి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. క్రీడాభివృద్ధికి, అనారోగ్యంతో బాధపడుతోన్న చిన్నారులకు ఈ మొత్తాన్ని వాడాలని స్వచ్ఛంద సంస్థను ఎంబపె కోరాడని సమాచారం. విశ్వ విజేతగా నిలిచిన ఫ్రాన్స్‌ జట్టు ఆటగాళ్లకు సొంతగడ్డపై ఊహించని రీతిలో స్వాగతం దక్కింది.

Untitled Document
Advertisements