న్యూయార్క్‌ వీధుల్లో ప్రియాంక చిందులు..

     Written by : smtv Desk | Tue, Jul 17, 2018, 06:17 PM

న్యూయార్క్‌ వీధుల్లో ప్రియాంక చిందులు..

హైదరాబాద్, జూలై 17 : గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. న్యూయార్క్‌ నగర వీధుల్లో చిందులు వేశారు. ఇటీవల హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడు 'బెవాచ్', 'క్వాంటికో' టీవీ సిరీస్ లలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా 'ఈజెంట్ ఇట్ రొమాంటిక్' అనే మరో హాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. టాడ్ స్ట్రాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రెబెల్ విల్సన్., లియామ్ హెమ్స్ వర్త్.. ఆడమ్ డివైన్.. బెట్టీ గిల్పిన్ లాంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అయితే ఈ చిత్రం కోసం న్యూయార్క్ వీధుల్లో ఒక పాట చిత్రీకరించారు. ఇందులో తోటి నటీనటు‌లతో కలిసి ప్రియాంక చిందులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. తనకన్నా ప్రముఖ నటీనటులున్నా.. ప్రియాంకే ఇందులో హైలైట్ అవుతోంది. హాట్ హాట్ గా ఉన్న పింక్ డ్రెస్సులో మెరిసిపోతోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





Untitled Document
Advertisements