దర్శకుడు మిస్కిన్ వ్యాఖ్యలపై నెటిజన్ల ఫైర్..

     Written by : smtv Desk | Tue, Jul 17, 2018, 06:45 PM

దర్శకుడు మిస్కిన్ వ్యాఖ్యలపై నెటిజన్ల ఫైర్..

హైదరాబాద్, జూలై 17 : మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి అంటే తనకు చాలా ఇష్టమని దర్శకుడు మిస్కిన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన 'పెరాన్బు' సినిమా టీజర్ ను చెన్నైలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా మిస్కిన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మిస్కిన్ మాట్లాడుతూ.. మమ్ముట్టిపై తన అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. "ఈ సినిమాలో మమ్ముట్టి కాకుండా మరొకరు నటించి ఉంటే ఓవర్‌ యాక్షన్‌ చేసేవారు. ఈ సినిమాలో ప్రేక్షకులు ఆయన్ను చూస్తూ ఉండిపోతారు. నేను వయసులో ఉండి, మమ్ముట్టి ఆడపిల్ల అయి ఉంటే ఆయన్ని అత్యాచారం చేసేవాణ్ని. ఇలా అసభ్యంగా మాట్లాడుతున్నానని అనుకోకండి. మమ్ముట్టి నటన నాకెంత నచ్చిందో చెప్పడానికే ఇలా మాట్లాడుతున్నా" అంటూ పేర్కొన్నారు.

మిస్కిన్‌ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వివాదాస్పదంగా మారాయి. ఓ దర్శకుడై ఉండి ఇలా మాట్లాడడమేంటి..? అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. మమ్ముట్టిపై ఉన్న గౌరవాన్ని ఇలా చూపించడం ఎంత వరకు సబబని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సూపర్ స్టార్ ను మెచ్చుకోవడానికి ఇతరుల మనోభావాలను దెబ్బతీయాలా.? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.





Untitled Document
Advertisements