ప్రియాంక బర్త్‌డే కై నిక్ స్పెషల్ పార్టీ..

     Written by : smtv Desk | Wed, Jul 18, 2018, 11:25 AM

ప్రియాంక బర్త్‌డే కై నిక్ స్పెషల్ పార్టీ..

ముంబై, జూలై 18 : గ్లోబల్ స్టార్, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా.. నేడు 35వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ మేరకు ప్రియాంక ప్రియుడు, హాలీవుడ్‌ గాయకుడు నిక్‌ జొనాస్‌ సర్‌ప్రైజ్‌ పార్టీ ఏర్పాటుచేశారు. గత కొంత కాలంగా హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్ తో ప్రియాంక ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీలు కుదిరినప్పుడల్లా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ జంట సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే ప్రియాంక బర్త్‌డే ను పురస్కరించుకొని ఇద్దరు కలిసి లండన్‌ వెళ్లారు. అక్కడి ఓ రెస్టారెంట్‌లో డిన్నర్‌ పార్టీ ఏర్పాటుచేశారు. డిన్నర్‌ ముగించుకుని నిక్‌ ప్రియాంక చెయ్యి పట్టుకుని తీసుకెళుతున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అంతేకాదు ప్రియాంక కోసం నిక్‌ బీచ్‌ లో పార్టీని ఏర్పాటుచేశాడట. పార్టీ నిమిత్తం స్నేహితులను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రియాంక తన ప్రేమ విషయాన్ని స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదంతా చూస్తుంటే.. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు హాలీవుడ్, బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.





Untitled Document
Advertisements