హృతిక్ రోషన్ Vs కంగనా రనౌత్‌..

     Written by : smtv Desk | Wed, Jul 18, 2018, 12:38 PM

హృతిక్ రోషన్ Vs కంగనా రనౌత్‌..

ముంబై, జూలై 18 : బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్.. టాప్ హీరోయిన్ కంగనా రనౌత్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అంతలా వారిద్దిరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకానొక సమయంలో వీరి మధ్య ఆరోపణలు.. ప్రత్యారోపణలు తీవ్ర స్థాయికి చేరాయి కూడా. ఒక దశలో మరీ శ్రుతి మించి ఆరోపణలు చేసిన కంగనా.. ఈ మధ్య కొంచెం తగ్గింది. అయితే ఇలాంటి ఇద్దరి మధ్య బాక్సాఫీస్ పోరు నడిస్తే ఎలా ఉంటుంది? దీనిపై బాలీవుడ్ మీడియాలో ఆసక్తికర చర్చ ఒకటి నడుస్తోంది. అదేంటంటే.. వచ్చే ఏడాది రిపబ్లిక్ డేకి వీళ్లిద్దరూ బాక్సాఫీస్ ఫైట్ పక్కా అని బాలీవుడ్ వర్గాలు అంటున్నారు.

హృతిక్ ప్రస్తుతం సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్ కథతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం హృతిక్ పూర్తిగా అవతారం మార్చుకున్నాడు. హృతిక్ కెరీర్లో ఇదో మైలురాయి అవుతుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని 2019 జనవరి 26న విడుదల చేయాడనికి చాలా ముందే నిర్ణయం అయిపోయింది. దానికి పోటీగా కంగనా సినిమా 'మణికర్ణిక' వస్తుందన్న ఊహాగానాలు వస్తున్నాయి.

టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలోనే విడుదల కావాల్సింది. కానీ అనివార్య కారణాలతో వాయిదా పడింది. కొన్ని కీలక ఎపిసోడ్లు రీషూట్ కూడా చేయబోతున్నారట. ఈ ఏడాది చివరికి పనంతా పూర్తవుతుందని అంటున్నారు. దీన్ని వచ్చే రిపబ్లిక్ డేకి రిలీజ్ చేద్దామని భావిస్తున్నారట. కంగనా ఈ విషయంలో పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే ఇంతా వరకు రియల్ లైఫ్ లో మాటల యుద్ధం చేసిన వీరు రీల్ లైఫ్ లో పోరుకు సిద్ధమవుతున్నారు. మరి ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.





Untitled Document
Advertisements